న్యూయార్క్​ టైమ్స్ ట్రావెల్​ లిస్ట్​..నాల్గో స్థానంలో అస్సాం

న్యూయార్క్​ టైమ్స్​ విడుదల చేసిన న్యూయార్క్​ టైమ్స్​ ట్రావెల్​ లిస్ట్​ 2025లో మొత్తం 52 ప్రదేశాలు ఉండగా, భారతదేశంలోని అసోం రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. 

అసోంలో సందర్శించదగిన ప్రదేశాలు: అహోం రాజవంశానికి చెందిన 700 సంవత్సరాల పురాతన శ్మశాన వాటిక చరైడియో మొయిడామ్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్నది. వాటిని పిరమిడ్స్​ ఆఫ్​ అసోం అని కూడా పిలుస్తారు. 51 శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య ఆలయం ప్రసిద్ధి చెందింది. గౌహతిలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి బదులుగా స్త్రీ జననేంద్రియ ఆకారంలో ఉన్న సహజ రాయిని పూజిస్తారు. ఒక కొమ్ము ఖడ్గమృగాలకు నిలయమైన కజిరంగా నేషనల్​ పార్క్, ప్రపంచ ప్రఖ్యాత తేయాకు తోటలను సందర్శించాల్సిందే. ఇక్కడి టీ మంచి రుచిని కలిగి ఉంటుంది. 

సందర్శించదగిన 52 ప్రదేశాల్లో కొన్ని: జేన్​ ఆస్టెన్​ (ఇంగ్లండ్), గాలాపాగోస్ దీవులు(ఈక్వెడార్), న్యూయార్క్​ సిటీ మ్యూజియం(యూఎస్​ఏ), అసోం(భారతదేశం), వైట్​ లోటస్​(థాయిలాండ్) గ్రీన్ లాండ్, ఐక్స్​ ఎన్​ ప్రోవెన్స్(ఫ్రాన్స్) సన్​ వ్యాలీ, ఇడాహో (అమెరికా), లుంబిని(నేపాల్​), సిడ్నీ (ఆస్ట్రేలియా).