బండరాళ్లతో కొట్టి హత్య

బండరాళ్లతో కొట్టి హత్య

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​జిల్లాలో ఓ వ్యక్తి  దారుణ హత్య గురయ్యాడు. బషీరాబాద్​మండలంలోని నావల్గా గ్రామానికికు చెందిన మాల శామప్ప  (39)ను గుర్తుతెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి చంపేశారు. నావల్గా గేటు సమీపంలో మంగళవారం ఉదయం అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బషీరాబాద్ ఎస్ఐ శంకర్, తాండూర్​రూరల్​ సీఐ నగేశ్, డీఎస్పీ  బాలక్రిష్ణారెడ్డి సంఘటనా  స్థలాన్ని పరిశీలించారు. క్లూస్​టీమ్​తో ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.