తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఎంతో ముఖ్యమైన రోజని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాష్కరణ బృహత్తరమైన కార్యక్రమమన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భేషజాలను, రాజకీయాలను పక్కనపెట్టాలని ప్రతిపక్ష నేతలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.