22వ తేదీ వరకు నాన్‌స్టాప్ అసెంబ్లీ

22వ తేదీ వరకు నాన్‌స్టాప్ అసెంబ్లీ

రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ముగిసింది. సభలో చర్చించాల్సిన అంశాలు, షెడ్యూల్ ను ఫైనలైజ్ చేశారు. ఈనెల 22వ తేదీవరకు అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ను నిర్వహించాలని నిర్ణయించారు. 10, 11, 12, 13 తేదీల్లో అసెంబ్లీ, మండలికి సెలవులు. సెప్టెంబర్ 14 నుంచి 22వ తేదీ వరకు 9రోజుల పాటు అసెంబ్లీ జరపాలని నిర్ణయించారు.

ఇవాళ సెప్టెంబర్ 9 ఇవాళ్టితో కలిపి మొత్తం 10 రోజులను అసెంబ్లీ పనిదినాలుగా డిసైడ్ చేశారు. ఈనెల 22 లోపు.. మధ్యలో వచ్చే సెకండ్ శాటర్ డే, 2 ఆదివారాల్లోనూ అసెంబ్లీ జరుగుతుంది.