బీఆర్​ఎస్​ నిరుద్యోగులను మోసం చేసింది : బోగ శ్రావణి

జగిత్యాల టౌన్ : బీఆర్ఎస్ నిరుద్యోగ యువతను వాడుకొని మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోగ శ్రావణి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జగిత్యాల రూరల్ మండల సోమనపల్లి, సంఘంపల్లె గ్రామంలో ప్రచారం నిర్వహించారు. మొదటిసారిగా బీజేపీ వల్ల ఆడబిడ్డ కి అవకాశం దక్కిందని ప్రజలు దీవించాలన్నారు. జగిత్యాల ఖిల్లాపై కాషాయ జెండా ఎగరవేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, గంగారం, రమేష్, కళావతి, రామేశ్వరి పాల్గొన్నారు.

ALSO READ : మంచిర్యాల బీజేపీ అభ్యర్థిగా రఘునాథ్