దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం (అక్టోబర్ 9) నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య 16 కోట్ల 14 లక్షల మంది ఉన్నారు.
మిజోరం ఎలక్షన్స్ డీటెయిల్స్ ఇవే..
2023 నవంబర్ 7న ఒకే విడతలో ఎలక్షన్స్ జరుగుతాయి
2023 డిసెంబర్ 3న ఆదివారం కౌంటింగ్
మిజోరం అసెంబ్లీకి 40 స్థానాలు ఉన్నాయి. జనరల్ కు ఒక సీటు కేటాయించారు. ఎస్సీ స్థానాలు ఏమీ లేవు. ఎస్టీ మాత్రం 39 స్థానాలు ఉన్నాయి. మిజోరాంలో 8 లక్షల 52 వేల మంది ఓటర్లు ఉన్నారు.
మిజోరంలో పురుష ఓటర్లు 4 లక్షల 13 వేల మంది ఉన్నారు
మిజోరంలో మహిళా ఓటర్లు 4 లక్షల 39 వేల మంది ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ ఎలక్షన్స్ డీటెయిల్స్ ఇవే..
2023 నవంబర్ 7న తొలివిడత, 17వ తేదీన రెండో విడతలో ఎలక్షన్స్ నిర్వహిస్తారు. డిసెంబర్ 3వ తేదీన ఎన్నిక ఫలితాలు ప్రకటిస్తారు.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి 90 స్థానాలు ఉన్నాయి. జనరల్ స్థానాలు 51 ఉన్నాయి. ఎస్సీ స్థానాలు 10, ఎస్టీ కేటగిరిలో 29 సీట్లు కేటాయించారు. ఛత్తీస్‌గఢ్ లో 2 కోట్ల 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ లో పురుష ఓటర్లు ఒక కోటి లక్ష మందికిపైగా ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ లో మహిళా ఓటర్లు ఒక కోటి 2 లక్షల మందికిపైగా ఉన్నారు.