- ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ
- నిజామాబాద్‌లో 6, కామారెడ్డిలో 3 సెగ్మెంట్ల కౌంటింగ్
- ఏర్పాట్లు కంప్లీట్
నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ ఆదివారం వెలువడనున్నాయి. పొద్దున 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపుతో రౌండ్ల వారీగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఫైనల్ రిజల్ట్ వెలువడే ఛాన్స్ ఉంది. ప్రతీ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అరగంటకో రౌండ్ ముగించేలా అధికారులు సన్నద్ధమయ్యారు. నిజామాబాద్‌అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ సెగ్మెంట్ల కౌంటింగ్ నిజామాబాద్పాలిటెక్నిక్ కాలేజీలో జరగనుండగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల కౌంటింగ్కామారెడ్డి జిల్లా పోలీస్ ఆఫీసు పక్కనున్న గోడౌన్లో చేపట్టనున్నారు.
కామారెడ్డిలో 19 రౌండ్లు
ఇక్కడ 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి కేసీఆర్ (బీఆర్ఎస్), రేవంత్‌రెడ్డి(కాంగ్రెస్), కాటిపల్లి వెంకటరమణారెడ్డి( బీజేపీ)లు ఉన్నారు. నియోజకవర్గంలో 266 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో రౌండ్లో 14 సెంటర్ల చొప్పున 19 రౌండ్లలో కౌంటింగ్ కంప్లీట్ కానుంది. మొత్తం 2,52,460 ఓటర్లకు గాను 1,90,811 మంది ఓటేశారు.
ఎల్లారెడ్డిలో 20 రౌండ్లు
ఎల్లారెడ్డిలో 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి జాజాల సురేందర్ (బీఆర్ఎస్), మదన్మోహన్రావు (కాంగ్రెస్), వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి (బీజేపీ) ఉన్నారు. 2,20,531 మంది ఓటర్లకు గాను 1,83,41 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజక వర్గంలో 270 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. 20 రౌండ్లలో లెక్కింపు చేస్తారు.
జుక్కల్‌లో 19
ఇక్కడ 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో హన్మంత్‌షిండే (బీఆర్ఎస్), తోట లక్ష్మీకాంత్‌రావు (కాంగ్రెస్), అరుణతార (బీజేపీ) ఉన్నారు. మొత్తం 1,99,962 మందికి గాను 1,63,569 మంది ఓటేశారు. మొత్తం 255 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో రౌండ్లో 14 బూత్‌ల చొప్పున 19 రౌండ్లలో లెక్కింపు కంప్లీట్ అవుతుంది.
అర్బన్‌లో 21
ఈ నియోకవర్గం నుంచి మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధాన పార్టీల నుంచి షబ్బీర్అలీ (కాంగ్రెస్), ధన్పాల్ సూర్యనారాయణ (బీజేపీ), బిగాల గణేశ్‌గుప్తా(బీఆర్ఎస్) ఉన్నారు. మొత్తం 289 పోలింగ్ సెంటర్లలోని 2,94,832 ఓట్లలో 1,81,808 ఓట్లు పోలయ్యాయి.
రూరల్‌లో 21
రూరల్ సెగ్మెంట్లో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల నుంచి డాక్టర్ భూపతిరెడ్డి (కాంగ్రెస్), బాజిరెడ్డి గోవర్ధన్(బీఆర్ఎస్), దినేశ్కులాచారి(బీజేపీ) పోటీ చేశారు. మొత్తం 293 పోలింగ్సెంటర్స్లోని 2,53,233 ఓట్లలో 1,93,556 ఓట్లు పోలయ్యాయి.
ఆర్మూర్16
ఈ నియోజకవర్గం నుంచి 13 మంది అభ్యర్థులు పోటీ చేయగా ప్రధాన పార్టీల నుంచి పొద్దుటూరి వినయ్‌రెడ్డి (కాంగ్రెస్), పైడి రాకేశ్‌రెడ్డి (బీజేపీ), ఆశన్నగారి జీవన్‌రెడ్డి (బీఆర్ఎస్) బరిలో ఉన్నారు. 217 పోలింగ్సెంటర్ల పరిధిలో మొత్తం 2,10,217 ఓటర్లున్నారు. అందులో 1,59,804 ఓట్లు పోలయ్యాయి.
బాల్కొండ 18
బాల్కొండ నియోజకవర్గంలో 8 మంది పోటీ చేశారు. అందులో ముత్యాల సునీల్‌రెడ్డి (కాంగ్రెస్), వేముల ప్రశాంత్‌రెడ్డి (బీఆర్ఎస్), ఏలేటి అన్నపూర్ణమ్మ (బీజేపీ) నుంచి బరిలో ఉన్నారు. 246 పోలింగ్కేంద్రాలున్న సెగ్మెంట్లో మొత్తం 2,21,445 ఓటర్లుండగా 1,76,586 పోలయ్యాయి. తుది రిజల్ట్మధ్యాహ్నం ఒంటిగంట వరకు రావచ్చు.
బోధన్18
ఈ నియోజకవర్గం నుంచి 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధాన పార్టీల తరఫున పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్), మహ్మద్షకీల్ఆమేర్(బీఆర్ఎస్), వడ్డీ మోహన్‌రెడ్డి (బీజేపీ) ఉన్నారు. 246 పోలింగ్ సెంటర్స్పరిధిలో మొత్తం 2,20,068 ఓట్లలో 1,71,247 ఓట్లు పోలయ్యాయి.
బాన్సువాడ 19
బాన్సువాడ సెగ్మెంట్‌నుంచి ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తుండగా ప్రధాన పార్టీల నుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి (కాంగ్రెస్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బీఆర్ఎస్), యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ) బరిలో ఉన్నారు. 258 పోలింగ్సెంటర్స్ఉన్న నియోజకవర్గంలో మొత్తం 1,95,191 ఓట్లకు గాను 1,58,663 ఓట్లు పోలయ్యాయి.
భారీ పోలీస్ బందోబస్తు
కౌంటింగ్ దృష్ట్యా పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కౌంటింగ్ సెంటర్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నిజామాబాద్సీపీ కల్మేశ్వర్సింగన్వార్, కామారెడ్డిలో ఎస్పీ సింధూశర్మ శనివారం కౌంటింగ్సెంటర్లను పరిశీలించి, బందోబస్తు ఏర్పాట్లపై డీఎస్పీలు, ఇతర ఆఫీసర్లకు సూచనలు చేశారు. కౌంటింగ్ స్టాప్, ఆఫీసర్లు, అభ్యర్థులు, ఏజెంట్లకు మాత్రమే లోనికి అనుమతిస్తారు.