
దండేపల్లి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార బీఆర్ఎస్నేతలు హడావుడిగా అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. తాజాగా మండలంలోని కొర్విచెల్మ కొత్త కొమ్ముగూడ గ్రామాలను కలుపుతూ నిర్మించే హై లెవెల్ వంతెన రోడ్డు పనులు ఇంకా పూర్తికాలేదు.. అయినప్పటికీ ఎమ్మెల్యే దివాకర్ రావు బుధవారం వంతెనను ప్రారంభించారు.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా రూ.కోటి, 58 లక్షల అంచనా వ్యయంతో ఈ వంతెన నిర్మిస్తున్నారు. దీనికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.