ముంబై : మహారాష్ట్ర రాజధాని. దేశానికి ఆర్థిక రాజధాని. దక్షిణాసియాలో అతి పెద్ద నగరం. తక్కువ ప్లేస్‌లో ఎక్కువ పబ్లిక్ ఉండే సిటీల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. మోడ్రన్ ఇండియాలోని భిన్నత్వానికి ముంబై అల్ట్రా మోడల్‌గా నిలుస్తోంది. ఫైనాన్షియల్‌గానే కాకుండా పొలిటికల్‌గా కూడా చాలా ముఖ్యమైన ప్రాంతం. ఈ మెట్రోపాలిటన్ సిటీలో మొత్తం 36 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మొన్న సైరన్ మోగటంతో అన్ని మేజర్ పార్టీల దృష్టీ ఈ నియోజకవర్గాలపైనే పడింది.
ఎన్నికలు ఏవైనా ముంబై మహా నగరం ఎప్పుడూ ప్రత్యేకమే. అక్కడ పోటీ చేసే క్యాండిడేట్లు, ఓటర్ల హైప్రొఫైల్ దీనికి కారణం. ముంబై జిల్లాను ముప్పై ఏళ్ల కిందటే రెండుగా విడదీశారు. ఒకటి.. ముంబై సిటీ. రెండు.. ముంబై సబర్బ్. ఈ రెండు చోట్లా కలిపి ప్రస్తుతం 36 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం సీట్ల సంఖ్య 288 కాగా, వాటిలో 12 శాతానికి పైగా రాజధాని, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండటం విశేషం.
రాజధానీ ప్రాంతంలోనూ మరాఠీలదే డామినేషన్. అయితే సిటీ పాలిటిక్స్‌ని ప్రభావితం చేయడంలో వలస ప్రజల పాత్రకూడా లేకపోలేదు. వీళ్లు ముంబై మహానగరాభివృద్ధిలో ఎప్పటినుంచో పాలుపంచుకుంటున్నారు. 1960, 70ల్లో ముంబైలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండే ఇతర ప్రాంతాలవాళ్లు నగర రాజకీయాలపై తమ ముద్ర వేసేవారు. ఎన్నికల ఫలితాలను ఊహించని రీతిలో మార్చేసేవారు. దీంతో ఈ మెట్రోపాలిటన్ సిటీని దేశ సెక్యులర్ మోడర్నిటీకి సింబల్‌గా గుర్తించటం మొదలైంది.
సీన్ మారింది
ముంబైలో జరిగే ఏ ఎలక్షన్లో అయినా మైగ్రెంట్స్ తమ ఉనికిని, ప్రభావాన్ని చూపే ట్రెండ్ దాదాపు ముప్పై, నలభై ఏళ్లపాటు కొనసాగింది. 1970ల్లో నగరం నుంచి ఎన్నికయ్యే ఎమ్మెల్యేల్లో మరాఠీ కాకుండా వేరే భాష మాట్లాడేవాళ్లు సుమారు 60 శాతం వరకు ఉండేవారు. మరాఠీ ఎక్కువగా మాట్లాడే రాష్ట్ర రాజధానిలో ఇతర భాషల ఎమ్మెల్యేలు మెజారిటీ సంఖ్యలో ఉండటం స్థానికులను ఆలోచనలో పడేసింది. రాజకీయాధికారం మరాఠీ మాట్లాడే మహారాష్ట్రవాసులకే చెందాలనే వాదన మొదలైంది. ‘స్థానిక మరాఠీ మాట్లాడనోళ్లు ఎవరైనా బయటివారే’ అనే అంశాన్ని శివసేన పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. తద్వారా పొలిటికల్‌గా ఎంతో లాభపడింది. అప్పటి నుంచి సిటీ రాజకీయాలు పూర్తిగా మారాయని చెప్పొచ్చు. 2000ల్లో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) రాకతో ‘భూమి పుత్రుల’ పేరిట వలస వ్యతిరేక నిరసనలు, హింసా రాజకీయాలు ప్రారంభమయ్యాయి.
ఈసారి మొత్తం సీట్లపై గురి
2014 ఎన్నికల అనంతరం ముంబై పరిధిలో ఎన్నికైన మరాఠా ఎమ్మెల్యేల శాతం 65కి పెరిగింది. శివసేనతోపాటు అన్ని పార్టీలూ ముంబై అసెంబ్లీ సెగ్మెంట్లలో స్థానిక మహారాష్ట్రీయన్లకే టికెట్లు ఇచ్చాయి. పోయినసారి ఎలక్షన్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేసినా, ఫలితాలు వచ్చాక పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సక్సెస్‌ఫుల్‌గా ఐదేళ్లు పవర్లో కంటిన్యూ అయ్యాయి. ఈసారి ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకున్నాయి. ముంబైని క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో బీజేపీ–సేన కూటమి ఉన్నట్లు ఇన్సైడర్లు చెబుతున్నారు. మెట్రో ప్రాజెక్టుల పేరుతో ప్రజలకు దగ్గర కావడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. కనీస సదుపాయాలే తమకు ఓట్లు రాలుస్తాయని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే, ఆర్థికమాంద్యం, రైతుల సమస్యలను ఆయుధాలుగా చేసుకుని ప్రజల దగ్గరకు వెళ్లడానికి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి నిర్ణయించుకున్నాయి. సిటీ, సబర్బన్లలో కాంగ్రెస్, ఎన్సీపీలకు పట్టున్న సెగ్మెంట్లలో కూడా పాగా వేయాలని ఈ కూటమి ప్లాన్ చేసిందంటున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలోని చండీవాలి, మలాడ్–వెస్ట్, ధారవి, వడాలా, ముంబాదేవి సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో బీజేపీ–శివసేన కూటమి ఆయిదు స్థానాలపైనా కన్నేసింది.
పోరాడుతున్న కాంగ్రెస్–ఎన్సీపీ
ఇక, మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గాలికి అల్లాడిపోయిన కాంగ్రెస్, ఎన్సీపీలు అసెంబ్లీ ఎన్నికల్లోనైనా కోలుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ముంబైలోని 36 సెగ్మెంట్లలో ఉనికి చాటుకోవడమే వాటి తక్షణ అజెండా. లోక్‌సభ ఫలితాలతో డీలా పడ్డ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపే పనిలో పడ్డాయి. వాళ్లను మళ్లీ ఎన్నికలకు సిద్ధం చేయటానికి కష్టపడుతున్నాయి. ముఖ్యంగా 15 సీట్లపై ఫోకస్ పెడతామని కాంగ్రెస్ స్టేట్ యూనిట్ మాజీ చీఫ్ సంజయ్ నిరుపమ్ చెప్పారు. మాజీ మంత్రులను; మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలను; సీనియర్ లీడర్లను రంగంలోకి దింపుతామన్నారు. ఎన్సీపీ 7 సీట్లకు పోటీచేయనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే విద్యా చవాన్ తెలిపారు.
ఊర్మిళ సైలెన్స్
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగీలా స్టార్ ఊర్మిళ మటోండ్కర్ ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ముంబై నార్త్ సీటు నుంచి పోటీ చేసి దాదాపు రెండున్నర లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో అయిదు అసెంబ్లీ సీట్లుండగా, కాంగ్రెస్‌కి ఒక్క మలాడ్ వెస్ట్ సెగ్మంట్లోనే ఎమ్మెల్యే ఉన్నారు. మిగిలిన నాలుగు సీట్లలోనూ మూడు బీజేపీ, ఒకటి శివసేన ఎమ్మెల్యేలున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయాక కొంతకాలం గమ్మున ఉండిపోయి, ఈ మధ్యనే కాంగ్రెస్‌కి రాజీనామా ఇచ్చేశారు. ఆమెతో శివసేన చీఫ్ ఉద్ధవ్‌కి నమ్మినబంటయిన మిలింద్ నార్వేకర్ సంప్రదింపులు జరుపుతున్నారు. తాను ఏ పార్టీలోనూ లేనని ఊర్మిళ చెబుతున్నప్పటికీ, ఈ వారంలోనే ఏదోక నిర్ణయానికి రావడం ఖాయమంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఎస్సీ, మైనారిటీ ఓట్లు మాకే
బీజేపీ, శివసేన ఇప్పుడు ఒక్కటిగా బరిలో ఉంటాయి. మా సీట్లు నిలబెట్టు కోవడంతోపాటు ప్రతిపక్ష పార్టీల సీట్లూ గెలుస్తా యి. ముస్లిం లు,
ఎస్సీలు, ఓబీసీలు పెద్ద సంఖ్యలో ఉన్న ఏరియాల్లోనూ మాదే గెలుపు. 14 సిట్టింగ్ సీట్లతోపాటు ధారవి, శివాజీ నగర్, చండీవాలి, మాన్ కుర్డ్, ముం బా దేవి, మాల్దా–వెస్ట్‌లను సొంతం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తాం.
– హర్షల్ ప్రధాన్, ఉద్ధవ్ ఠాక్రే మీడియా అడ్వయిజర్