అసెంబ్లీ వేదికగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు ముంచెత్తారు ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు.ఏపీ 16 వ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వమని గతంలో డైలాగులు చెప్పారని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాలను మొత్తం గెలుచుకుని తన సత్తా ఏంటో చూపించారని చంద్రబాబు అన్నారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు.
వైనాట్ 175 అన్న వైసీపీకి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయింది.. ఇది దేవుడు రాసిన స్క్రిప్టు అని అన్నారు. వైసీపీ హయాంలో నడిచిన సభలాంటి సభను గతంలో ఎన్నడూ చూడలేదని .. సభలో హుందాతనంతో ముందు కెళ్లాలి.. ఇక వెకిలితన, వెకిలి మాటలకు స్వస్తి అన్నారు. చట్ట సభల విలువ తెలిసి వ్యక్తి అయ్యన్న పాత్రుడు.. ఆయన నాయకత్వంలో సభ హుందాతనం పెరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు.