జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడానికి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలనుకుంటున్నట్లు తెలంగాణ సీఎంఓ కార్యాలయం తెలిపింది. ‘జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు.. హైకోర్టు సూచించిన మరికొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉంది. అందుకోసం వచ్చే సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. శుక్రవారం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’ అని తెలంగాణ సీఎంఓ కార్యలయం ప్రకటించింది.
For More News..