
పార్టీ మారిన MLAలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు ( మార్చి25) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్ల వ్యవహారంలో స్పీకర్ చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నారని అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ లో పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని, అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించారు.
స్పీకర్ నిర్ణయం తీసుకునేవారకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని.. ఈ విషయంలో అనేక తీర్పులున్నాయని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. అనర్హత కేసులో చట్ట ప్రకారం స్పీకర్ వ్యవహరిస్తున్నప్పటికి.. పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఆశ్రయించిన వెంటనే బీఆర్ఎస్ నేతలు కోర్టుకెక్కారని.. కాబట్టి వారి స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టేయాలని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు.