20 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం... ఉపముఖ్యమంత్రి భట్టి

20 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం... ఉపముఖ్యమంత్రి భట్టి

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.  రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్​ అధికారంలో ఉంటుందన్నారు. దేశం గర్వించేలా గురుకులాలను ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లు  ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పట్టించారన్నారు. ప్రతి నియోజకవర్గంలో అంబేథ్కర్​ స్కిల్​ డెవలప్​ మెంట్​ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు.

త్వరలో స్పష్టమైన విద్యుత్​ పాలసీని అమలు చేస్తామన్నారు.  2035 వరకు విద్యుత్​ పాలసీని సిద్ధం చేశామని ఉపముఖ్యమంత్రి అన్నారు.   వ్యవసాయానికి రూ. 72 కోట్లు కేటాయిస్తే.. దానిని బీఆర్​ఎస్​ నేతలు విమర్శిస్తున్నారు.  ఇక ఎస్సీ, ఎస్టీల అభివృద్దికి రూ. 17 వేల 56 కోట్లు కేటాయించామన్నారు. హైదరబాద్​ అభివృద్దికి 10 వేల కోట్ల రూపాయిలు కేటాయిస్తే.. దానిని కూడా బీఆర్​ఎస్​ నేతలు విమర్శిస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి అసెంబ్లీలో ప్రసంగించారు, 

 ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్​ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందన్నారు. 4.5  లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామన్నారు. గ్యారంటీలను అమలు చేసేందుకు మంత్రులందరూ కష్టపడి చేస్తున్నారని అసెంబ్లీలో తెలిపారు. తెలంగాణలో మొదటిసారిగా స్కిల్​ డెవలప్​ మెంట్​ యూనివర్శిటీకి రూపకల్పన చేశామన్నారు. రైతు భరోసాను అమలు చేసేందుకు విధి విధాలపై చర్చిస్తున్నామన్నారు. ప్రజాధనం వృథా కాకూడదనే.. రైతుల నుంచి సలహాలు తీసుకుంటున్నామన్నారు.  గతంలో అనర్హులకు వేల కోట్లు రైతు బంధు ఇచ్చారన్నారు.  గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటే.. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే 65 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం రాగానే ఉచిత బస్సు, గ్యాస్​ సిలెండర్​లు ఇస్తున్నామన్నారు.  మార్చి 1 నుంచే ఉచిత విద్యుత్​ పథకాన్ని అమలుచేస్తున్నామన్నారు.

రైతు భరోసాపై విపక్షాలు అడ్డగోలుగా విమర్శిస్తున్నాయని భట్టి అన్నారు. బడ్జెట్​ లో అంకెలగారడీ ఏమీ లేదన్నారు, రైతు రుణమాఫీ గురించి కొందరు ఎగతాళి చేశారు... ఈ ఏడాది నుంచే రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామన్నారు.  మా గ్యారంటీల సంగతి సరే.. పదేళ్లలో బీఆర్​ఎస్​ ఏంచేసిందో చెప్పాలన్నారు.  మంజీరా నీళ్లు హైదరాబాద్​కు కాంగ్రెస్​ హయాంలోనే వచ్చాయన్నారు,. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి పదేళ్లు అయినట్లుగా విపక్ష నేతలు విష ప్రచారం చేస్తున్నారని భట్టి అన్నారు.