అసెంబ్లీ సెషన్స్ 2 రోజులు పొడిగింపు​!

  • ఆగస్టు 1, 2 న కూడా నిర్వహించే చాన్స్​

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించాలని సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది.  ఇటీవల బీఏసీ సమావేశంలో ఈ నెల 31 వరకే అసెంబ్లీ సెషన్స్​నిర్వహించాలని  నిర్ణయించారు. అయితే,  రైతు భరోసా, రుణమాఫీ, స్కిల్‌‌ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్‌‌ కమిషన్‌‌, వ్యవసాయ కమిషన్‌‌, తదితర వాటికి సభ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సభను మరో రెండు రోజులపాటు పొడిగించి, ఆగస్టు 1, 2వ తేదీల్లో కూడా సభను నిర్వహించనున్నట్టు సమాచారం.అసెంబ్లీతోపాటు శాసన మండలి కూడా ఆ రెండు రోజులపాటు కొన‌‌సాగ‌‌నున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం ఇవ్వనున్నారు.