అప్పుడు ఫార్మాసిటీని వ్యతిరేకించారు.. ఇప్పుడు భూములు లాక్కొంటున్నారు

అప్పుడు ఫార్మాసిటీని వ్యతిరేకించారు.. ఇప్పుడు భూములు లాక్కొంటున్నారు

వరుసగా మూడు సార్లు బడ్జెట్​ ప్రవేశ పెట్టిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బీఆర్​ఎస్​ఎమ్మెల్యే హరీశ్​ రావు కృతఙ్ఞతలు తెలిపారు.గతంలో ఫార్మాసిటీని వ్యతిరేకించిన కాంగ్రెస్​ నేతలు ఇప్పుడు  ఫ్యూచర్​ సిటీ పేరుతో ప్రభుత్వం భూములు లాక్కుంటుందని హరీశ్​ రావు అసెంబ్లీలో అన్నారు.  ఇక రైతు రుణ మాఫీ గురించి మాట్లాడిన హరీశ్​.. సగం మందికి కూడా రుణ మాఫీ జరగలేదని విమర్శించారు.  రైతుభరోసా కూడా ఇంకా అందరికి అందలేదన్నారు.  

భట్టి బడ్జెట్​ వాస్తవికతలకు దూరంగా ఉందన్నారు.  కౌలు రైతులకు సాయం ఎక్కడ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఎక్కడ అంటూ ప్రశ్నించిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​.. ఏడాది కాలంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు.  గత బడ్జెట్​ కేటాయింపులను పోల్చుతూ మాజీ మంత్రి హరీశ్​ రావు అసెంబ్లీలో ప్రసంగించారు.ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్​.. తరువాత  అమలు చేయడం లేదన్నారు. నిరుద్యోగ భృతి.. ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.