గిరిజన విద్యార్థిని చదువుకు స్పీకర్ ఆర్థికసాయం

వికారాబాద్, వెలుగు :  గిరిజన విద్యార్థిని ఇంజనీరింగ్ చదువుకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆర్థికసాయం అందించారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధి అనంతగిరిపల్లి( లక్ష్మీ నగర్ తండా )కు చెందిన కె.పల్లవికి హైదరాబాద్ లోని శ్రీ నిధి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. ఆమె కుటుంబం తీవ్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండగా విద్యార్థిని చదివించలేని పరిస్థితిని తెలుసుకుని కాంగ్రెస్ నేతలు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు.

 విద్యార్థిని చదువుకు రూ. 50 వేల ఆర్థికసాయాన్ని వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి విద్యార్థినికి గురువారం అందజేశారు. పల్లవి కుటుంబ సభ్యులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కృతజ్ఞతలు చెప్పారు.  టౌన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రెడ్యానాయక్, నేతలు సామ ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, రాజు, భాగయ్య, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు