కొడంగల్, వెలుగు: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని అదే విధంగా తీర్పు ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. సోమవారం కొడంగల్‌లో ప్రజా పాలన విజయోత్సవాలకు సోమవారం ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక 48 గంటల్లోనే ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలు చేశామన్నారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌ను అందిస్తున్నట్లు గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లా యువతకు స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కలెక్టర్ప్రతీక్జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి, ఎస్పీ నారాయణరెడ్డి, కొడంగల్ ఇన్‌చార్జి
తిరుపతిరెడ్డి ఉన్నారు.