చేవెళ్లలో రంజిత్​రెడ్డిని గెలిపించండి : గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, వెలుగు: తనను దీవించినట్లుగా, లోక్​సభ ఎన్నికల్లో చేవెళ్లలో కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డిని ఆశీర్వదించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. బుధవారం ఆయన వికారాబాద్ మండలం మైలార్ దేవరంపల్లిలో రంజిత్​రెడ్డికి మద్దతుగా రోడ్ షో, కార్నర్​మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్​కుమార్​మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్​ముగియగానే గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు చేయిస్తానన్నారు.

 చెరువు తవ్విస్తానని, చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడేలా గ్రామీణ బ్యాంక్, పీహెచ్​సీ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే స్పీకర్ ప్రసాద్​కుమార్​సమక్షంలో కల్కోడ సొసైటీ డైరెక్టర్ జగదీశ్, ఆయన అనుచరులు, దమస్తాపూర్ బీఆర్ఎస్​అధ్యక్షుడు గోవర్ధన్​రెడ్డి, వార్డు మెంబర్లు, కటిస్టెంట్ సర్పంచ్ అభ్యర్థి ప్రమోద్, 150 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు.