
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల శివారులో పునర్నిర్మించిన 800 ఏండ్ల నాటి స్వయంభు శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తోపాటు ఏఐసీసీ జాతీయ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హాజరయ్యారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. కేరళ, వికారాబాద్ తర్వాత ఇక్కడ 800 ఏండ్ల నాటి అనంతపద్మనాభ స్వామి ఆలయంఉండడం గొప్ప విషయమన్నారు. ఈ ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ నిర్వాహకులు, మాజీ జడ్పీటీసీ, మామిడి శ్యాంసుందర్ రెడ్డి, ఆలయ చైర్మన్ బెజవాడ అనితారెడ్డి ఉన్నారు.
ఎల్లమ్మ సేవలో..
కొడంగల్: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి రేణుక ఎల్లమ్మను అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్ సోమవారం దర్శించుకున్నారు. ఎల్లమ్మ బ్రహోత్సవాల సందర్భంగా పోలేపల్లికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.