- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు : ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకం కలిగేలా వైద్య సేవలను సిబ్బంది అందించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. బుధవారం వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో రూ. కోటి 56 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలు ..
ప్రైవేట్ఆస్పత్రుల చుట్టూ తిరగలేని వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రూపాయి ఖర్చు లేకుండా సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే గర్భిణులు కాన్పులు అయ్యేలా చూడాలని ఆశ వర్కర్లకు ఆయన సూచించారు.
కార్యక్రమంలో ఆర్డీవో వాసు చంద్ర, డీఎంహెచ్ఓ పాల్వన్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, డాక్టర్ సుజల, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, పీఆర్ ఈఈ ఉమేశ్‌కుమార్, ఎంపీపీ వసంత, మర్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సావిత్రమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు శంకర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.