
- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
కొడంగల్,వెలుగు : ఆర్య వైశ్యులు రాజకీయాల్లో రాణించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆకాంక్షించారు. ఆదివారం కొడంగల్‌లో నిర్వహించిన వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ప్రజా సేవలో ముందుండే ఆర్య వైశ్యులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శివకుమార్ గుప్తను అభినందించారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, కొడంగల్ కాంగ్రెస్ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు జగదీశ్వర్‌రెడ్డి, స్వప్న పెరుమాళ్, మంజుల రమేశ్, ఎంపీపీ ముద్దప్ప, నేతలు ప్రశాంత్, బాలేశ్వర్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.