ముత్యాలమ్మ టెంపుల్ లో స్పీకర్ ప్రత్యేక పూజలు 

ముత్యాలమ్మ టెంపుల్ లో స్పీకర్ ప్రత్యేక పూజలు 

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ముత్యాలమ్మ టెంపుల్ ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్పీకర్ ను అర్చకులు, స్థానిక నేతలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు స్పీకర్​కు ఎస్పీ శరత్ చంద్ర పవార్ పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.