బాన్సువాడ, వెలుగు : అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన పాత అంబాసిడర్ కారులో వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కారంటే ఆయనకు చాలా సెంటిమెంట్. ప్రతి ఎలక్షన్ టైమ్‌లోనూ ఆయన ఆ కారులోనే వెళ్లి నామినేషన్ వేస్తారు. శనివారం కూడా అదే కారులో వెళ్లి నామినేషన్ వేశారు.
1994 ఎన్నికల నుంచి నామినేషన్ వేయడానికి వెళ్లేందుకు పోచారం ఈ కారు వాడుతున్నారు. ఆ తర్వాత ఫార్చ్యునర్, బీఎండబ్ల్యూ లాంటి ఎన్ని కార్లు ఉన్నా పాత అంబాసిడర్ కారులోనే వెళ్లి నామినేషన్ వేస్తున్నారు.