ముదిరాజ్​లను బీసీ ఏలో చేర్చాలి

ముదిరాజ్​లను బీసీ ఏలో చేర్చాలి

 వికారాబాద్, వెలుగు :  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముదిరాజ్​లను  బీసీ డీ గ్రూపు నుంచి ఏలోకి మార్చాలని వికారాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం నేతలు కోరారు.  ఆదివారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన ముదిరాజ్​లు అన్నిరంగాల్లో  వెనుకబడి ఉన్నారన్నారు. మంత్రివర్గంలో ముదిరాజులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.

 ముదిరాజ్ కో – ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పాటుతో పాటు ప్రతి ఏడాది రూ.1000 కోట్ల నిధులు కేటాయించి 75 శాతం సబ్సిడీతో సబ్సిడీ పథకాలు అమలు చేయాలని పేర్కొన్నారు.   స్పీకర్ సానుకూలంగా స్పందిస్తూ సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు ముదిరాజ్ సంఘ నేతలు తెలిపారు. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు గొట్టిముక్కల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్కోడ నర్సింలు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బస్వాపురం రాములు, జిల్లా జాయింట్ సెక్రటరీ సిద్దులూరు కృష్ణ, కోట్ పల్లి మండల జనరల్ సెక్రటరీ మందుల శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం నేతలు ఉన్నారు.