వికారాబాద్, వెలుగు: వికారాబాద్ వెంకటాపూర్ తండాలోని జగదాంబ భవానీ మాత, సేవాలాల్ మహారాజ్ ఆలయ 18వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అనంతగిరిపల్లిలో కొత్తగా నిర్మించిన లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ముఖ ద్వారాన్ని ప్రారంభించారు. అంతకుముందు రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ నాంపల్లిలోని ఉదయ్ ఓమ్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోమిన్ పేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్ ను పరామర్శించారు.