గంజాయి అమ్మకాలు ఆపకుంటే ఆస్తుల జప్తు

గంజాయి అమ్మకాలు ఆపకుంటే ఆస్తుల జప్తు
  • ఎక్సైజ్‌‌ ఎన్​ఫోర్స్‌‌మెంట్‌‌ జాయింట్‌‌ కమిషనర్‌‌ ఖురేషి

మెహిదీపట్నం, వెలుగు: మల్లయోధులు, కళాకారులకు ప్రఖ్యాతి గాంచిన ధూల్‌‌పేట్​ సంస్కృతిని మరిచి, కొందరు నేడు గంజాయి అమ్మకాలు చేపట్టడం దురదృష్టకరమనని ఎక్సైజ్‌‌ ఎన్‌‌ ఫోర్స్‌‌మెంట్‌‌ జాయింట్‌‌ కమిషనర్‌‌ ఖురేషి అన్నారు. గంజాయి అమ్మకాలు  పూర్తిగా నిలిపివేయకపోతే ఇక నుంచి మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధూల్‌‌పేట్‌‌ ఆపరేషన్‌‌లో భాగంగా రహీంపురలోని గౌడ మఠంలో బుధవారం అవగహన సదస్సు నిర్వహించారు. ఇప్పటివరకు కేసులు, అరెస్టులు చేశామని, రెండో విడతలోకి దిగితే కేసులతోపాటు ఆస్తుల జప్తుకు దిగాల్సి ఉంటుందన్నారు. గంజాయి అమ్మకాలపై ప్రభుత్వం సీరియస్​గా ఉందని, అమ్మకాలను ఆపకుంటే ఎవ్వరినీ వదిలి పెట్టేది లేదన్నారు.