- ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి వార్నింగ్
- ఆపరేషన్ ధూల్‌పేటలో భాగంగా 9 బృందాలతో తనిఖీలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గంజాయి అమ్మకాలు ఆపకుంటే ఆస్తులతో పాటు నగదును స్వాధీనం చేసుకుంటామని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి, డీసీపీ చంద్రమోహన్ హెచ్చరించారు.
ఆపరేషన్ధూల్పేటలో భాగంగా సోమవారం మూడు సివిల్ పోలీసు, ఆరు ఎక్సైజ్ టీమ్స్ తో తనిఖీలు చేపట్టారు. గంజాయి అమ్మకందారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తనిఖీల్లో భాగంగా ఒక కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. ధూల్‌పేటలో గంజాయిని పూర్తిగా నిలిపివేసేదాక తనిఖీలు నిర్వహిస్తామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు.
అమ్మకాలను పూర్తిగా నిలిపి వేయాలని లేదంటే ఆస్తుల జప్తుతోపాటు పీడీ యాక్ట్ లు పెడతామని హెచ్చరించారు. అడిషనల్ ఎస్పీ భాస్కర్, అసిస్టెంట్ కమిషనర్లు అనిల్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గోషామహల్ ఏసీపీ, ధూల్‌పేట ఇన్ చార్జి ఎక్సైజ్ ఈఎస్ నంద్యాల అంజిరెడ్డి, డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్, మంగళ హార్డ్, ధూల్‌పేట సీఐలు మహేశ్, మధుబాబు పాల్గొన్నారు.