
స్కోర్ సాధించిన వారికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-2 (టెక్నికల్) పోస్ట్‌ల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో సెంట్రల్లో మంచి జాబ్ సొంతం చేసు కోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా గేట్‌లో సాధించిన ర్యాంకుతో డైరెక్ట్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. నోటిఫికేషన్ సమాచారంతో పాటు ఇంటర్వ్యూ ప్రాసెస్, విధుల గురించి తెలుసుకుందాం..
ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు విభాగాల్లో 226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్–2/టెక్నికల్ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. వీటిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 79 పోస్ట్‌లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 147 పోస్ట్‌లు ఉన్నాయి.
అర్హత: బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (లేదా) ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో ఫిజిక్స్ సబ్జెక్ట్‌తో పీజీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ ఉత్తీర్ణత పొందాలి. సంబంధిత బ్రాంచ్/సబ్జెక్ట్‌లో బీటెక్ లేదా ఎమ్మెస్సీతోపాటు గేట్–2021, 2022, 2023లో అర్హత సాధించాలి. వయసు జనవరి 12, 2024 నాటికి 18 నుంచి 27 ఏళ్లు (ఎస్‌సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు) ఉండాలి.
గేట్ స్కోర్ ముఖ్యం: 2021, 2022, 2023లో గేట్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్(ఈసీ), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(సీఎస్) పేపర్లలో ఉత్తీర్ణతను దరఖాస్తుకు అర్హతగా పేర్కొన్నారు. వీరి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నెలకు లక్ష జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పే లెవల్–7 (రూ.44,900 – రూ.1,42,400 వేతన శ్రేణి)లో ప్రారంభ వేతనం లభిస్తుంది. మూల వేతనం రూ.44,900గా ఉంటుంది. దీనికి అదనంగా డీఏ, ఎస్‌ఎస్‌ఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, డీఏ వంటి ఇతర భత్యాలు లభిస్తాయి. ఇలా.. మొత్తంగా నెలకు రూ.లక్ష వరకు నికర వేతనం వస్తుంది.
ఇంటర్వ్యూతో ఉద్యోగం: అభ్యర్థులు గేట్–2021, 2022, 2023లలో తమకు వచ్చిన బెస్ట్ స్కోర్‌తో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ గేట్ స్కోర్ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు 10 మందిని చొప్పున ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది నియామకాలు ఖరారు చేస్తారు. ఇంటర్వ్యూకు మొత్తం 175 మార్కులు కేటాయించారు. ఫైనల్ మెరిట్ జాబితాను రూపొందించేందుకు.. గేట్ స్కోర్‌ను, ఇంటర్వ్యూలో పొందిన మార్కులను చూస్తారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న పోస్ట్‌లు, రిజర్వేషన్, ఇతర నిబంధనలను అనుసరిస్తూ తుది నియామకాలు ఖరారు చేస్తారు.
ఇంటర్వ్యూ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ మొత్తం 175 మార్కులకు ఉంటుంది. ఇందులో భాగంగా సైకోమెట్రిక్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రధానంగా జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అదే విధంగా ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు సంబంధించి అభ్యర్థులకు ఇంటెలిజెన్స్ బ్యూరోపై ఉన్న అవగాహన, ఇంటెలిజెన్స్ బ్యూరో విధులు, దేశంలో శాంతి భద్రతలు తదితర విషయాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు.
సబ్జెక్ట్ స్కిల్స్‌పై ఫోకస్: ఇంటర్వ్యూలో భాగంగా సబ్జెక్ట్ స్కిల్స్ పరిశీలిస్తారు. అభ్యర్థులు బీటెక్ స్థాయిలో చదివిన సబ్జెక్ట్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. దాంతో పాటు సాంకేతిక నైపుణ్యాలను.. నిఘా విభాగంలో ఎలా ఉపయోగించొచ్చు? ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్‌లలో టెక్నాలజీని అమలు చేస్తున్న తీరు? తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే చాన్స్ ఉంది. అభ్యర్థులు ఇంటెలిజెన్స్ బ్యూరో విధి విధానాలపై అవగాహన ఏర్పరచుకోవడం మంచిది. అకడమిక్స్ కోణంలో తాము చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, వాటి ద్వారా గుర్తించిన సమస్యలు, వాటికి కనుగొన్న పరిష్కారాలు, అవి ఉపయోగపడే తీరు వంటి వాటి గురించి రివిజన్ చేసుకోవడం మంచిది.
ఆఫీసర్ డ్యూటీస్ అండ్ ప్రమోషన్స్: ఏఐసీఓ గ్రేడ్–2/టెక్నికల్‌గా ఎంపికైతే నిఘా విభాగానికి సంబంధించిన వివిధ కార్యకలాపాలను సాంకేతికీకరణ చేసే విధంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నివేదికలు రూపొందించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ను వినియోగించడం, నిఘా విధులకు కీలకంగా నిలుస్తున్న కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ సాధనాల పనితీరు పర్యవేక్షించడం వంటి పనులు చేయాలి.
ఏసీఐఓ గ్రేడ్–2 హోదాలో నియమితులైన వారు భవిష్యత్తులో పదోన్నతుల ద్వారా డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి కూడా చేరుకునే అవకాశం ఉంది. తొలుత ఏసీఐఓ గ్రేడ్–1గా పదోన్నతి లభిస్తుంది. ఆ తర్వాత ప్రతి హోదాకు ఆరు నుంచి ఎనిమిదేళ్ల కాల వ్యవధి ఆధారంగా.. డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, జాయింట్ డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ వంటి హోదాలకు చేరుకోవచ్చు. 27 ఏళ్ల వయసులో కొలువులో చేరిన వారు పదవీ విరమణ సమయానికి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి చేరుకోవచ్చు. అత్యున్నత ప్రతిభతో డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి కూడా చేరుకోవచ్చు.
నోటిఫికేషన్
ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలెక్షన్: గేట్ స్కోరు/ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్/ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు జనవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.mha.gov.in
వెబ్సైట్లో సంప్రదించాలి.