
ఇంటెలిజెన్స్ బ్యూరో- దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: బీఈ, బీటెక్ లేదా ఎంఎస్సీ, పీజీ. గేట్ స్కోరు తప్పనిసరి. వయసు 18 నుంచి -27 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్: గేట్ స్కోరు/ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్/ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు జనవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.mha.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.