![Jobs: ఐటీబీపీలో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు](https://static.v6velugu.com/uploads/2025/02/assistant-commandant-jobs--itbp_O3XbaGLSU4.jpg)
అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) దరఖాస్తులు కోరుతున్నది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు 46: అసిస్టెంట్కమాండెంట్
అర్హత: 2025, ఫిబ్రవరి 2వ తేదీ వరకు 30 ఏండ్లు మించరాదు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
అప్లికేషన్ ప్రాసెస్: ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరిస్తారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.400 ఫీజు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.
సెలెక్షన్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్(స్కిల్) టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు: అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500.