
ఇండియన్ కోస్ట్‌గార్డ్ 02/2022 బ్యాచ్ కోసం వివిధ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్(గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: 50
మొత్తం 50 పోస్టుల్లో జనరల్ డ్యూటీ మేల్ కేటగిరీలో 30, కమర్షియల్ పైలట్ మేల్, ఫిమేల్ విభాగంలో 10, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ టెక్నికల్ కేటగిరిలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అసిస్టెంట్ కమాండెంట్లు
గ్రూప్ ఏ గెజటెడ్ ఆఫీసర్ స్థాయి గల ఈ పోస్టుకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు అప్లై చేసుకోవచ్చు. 1997 జులై 1 నుంచి 2021 జూన్ 30 మధ్య జన్మించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
కమర్షియల్ పైలెట్ ఎంట్రీ
ఈ విభాగంలో మేల్, ఫిమేల్ అభ్యర్థులు అర్హులు. ఇందులో మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు డీజీసీఏ జారీచేసిన వ్యాలిడ్ కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉండాలి. 1997 జూలై 1 నుంచి 2021 జూన్ 30 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు.
టెక్నికల్ కేటగిరీ
ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన మేల్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుకు అర్హులు. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ప్రిలిమ్స్, ఫైనల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ప్రిలిమ్స్: మెంటల్ ఎబిలిటీ టెస్ట్/కాగ్నిటివ్ అప్టిట్యూడ్ టెస్ట్, పిక్చర్ పర్‌సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్, అప్టిట్యూడ్ టెస్ట్‌పై ఇంగ్లిష్ భాషలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఫైనల్ సెలక్షన్‌లో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ ఉంటాయి.
దరఖాస్తులు: అప్లికేషన్స్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభమవుతాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబర్ 17 వరకు అప్లై చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in