
చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా యూఐఐసీ కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు : అసిస్టెంట్ : 300 పోస్టులు (యూఆర్- 159, ఎస్సీ- 30, ఎస్టీ- 26, ఓబీసీ- 55, ఈడబ్ల్యూఎస్- 30). ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 3 ఖాళీలున్నాయి.
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. సంబంధిత ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్ : ఆన్‌లైన్ పరీక్ష, రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు : అభ్యర్థులు ఆన్లైన్లో జనవరి 6 వరకు అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.uiic.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.