నిర్మల్ జిల్లాలో ఏసీబీ సోదాలు.. అడ్డంగా దొరికిపోయిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

నిర్మల్ జిల్లాలో ఏసీబీ సోదాలు.. అడ్డంగా దొరికిపోయిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

నిర్మల్ జిల్లాలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ అసిస్టెంట్ కార్మిక శాఖ అధికారి నివాసంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయిబాబాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గంగన్న అనే వ్యక్తి దగ్గర నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటూ.. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయిబాబా దొరికాడని ఏసీబీ అధికారులు తెలిపారు. 

ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వి వి రమణమూర్తి మాట్లాడుతూ.. తమకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు(డిసెంబర్ 18) మధ్యాహ్నం సమయంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ వీధిలో గల అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయిబాబా ఇంటి వద్ద కడెం మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన గంగన్న అనే వ్యక్తి తల్లి రిజిస్టర్డ్ లేబర్ ఆమె చనిపోతే వారికి రావలసిన రూ. లక్ష 30 వేల బెనిఫిట్ గూర్చి ఫైల్ ను జిల్లా కార్మిక శాఖ అధికారి కి పంపేందుకు రూ. 30 వేలను డిమాండ్ చేయగా రూ. 25 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇంటి దగ్గర అతని కొడుకు దామోదర్... గంగన్న ద్వారా రూ. 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయిబాబా ను, అతని కుమారుడు దామోదర్ ను కరీంనగర్ లోని సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.