తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ కె.సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చిన్నగూడూరు మండలం బావోజి తండాకు చెందిన దరంసోత్ వెంకన్న కొడుకు నరేశ్ 2022 ఫిబ్రవరి 2న లేబర్ కార్డుకు అప్లై చేసుకున్నాడు. ప్రమాదవశాత్తు డిసెంబర్ 8న చనిపోయాడు. దీంతో అతడి తండ్రి వెంకన్న ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం తొర్రూరు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పి.సుమతిని కలిశాడు.
రూ.30 వేలు లంచం ఇస్తేనే క్లైమ్ చేస్తానని ఆమె డిమాండ్ చేశారు. దీంతో బాధి తుడు వెంకన్న ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం తొర్రూరు లేబర్ ఆఫీస్‌లో సుమతి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్, ఇన్స్పెక్టర్లు శ్యాంసుందర్, రవి, వారి సిబ్బందితో దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.