- అసిస్టెంట్ లైన్‌మన్‌ను
- చితకబాదిన మహిళలు
- కాళ్లు పట్టించి రాజీ కుదిర్చిన పోలీసులు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విద్యుత్ శాఖలో పని చేసే అసిస్టెంట్ లైన్‌మన్ ఓ ఇంటికి కరెంట్బిల్లు ఇవ్వడానికి వెళ్లి, ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారయత్నం చేశాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఏఎల్ఎం మల్లేశ్ నాగర్ కర్నూల్ మండలం బొందలపల్లిలో ఓ యువతి(19) ఇంటికి కరెంట్ బిల్లు కొట్టడానికి వెళ్లాడు. ఇంటి బయట ఒంటరిగా ఉండడంతో ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్తుండగా అరిచింది.
దీంతో చుట్టుపక్కల మహిళలు చేరుకొని అతడిని చితకబాదారు. బాధితురాలి తల్లిదండ్రులు మల్లేశ్‌ను చెప్పుతో కొట్టారు. పోలీసులకు చెప్పగా వచ్చి విచారణ జరిపారు. తర్వాత బాధితురాలి కాళ్లు పట్టించి రాజీ కుదిర్చినట్లు సమాచారం.