
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)- వివిధ విభాగాల్లో మొత్తం 97 ఆఫీసర్ గ్రేడ్- ఎ (అసిస్టెంట్ మేనేజర్) ఉద్యోగాలకు అప్లికేషన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 13 నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 2024 మార్చి 31 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 ఏళ్లు మించకూడదు. కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్: ఫేజ్-1, ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాలు ఏప్రిల్ 13న నోటిఫికేషన్లో వెల్లడి కానున్నాయి. సమాచారం కోసం www.sebi.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.