మహబూబాబాద్ అర్బన్, వెలుగు : బీజేపీ మహబూబాబాద్ నియోజకవర్గ టికెట్ తనకు కేటాయించాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాలోతు రవీందర్‌నాయక్ కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ని కలిసి అప్లికేషన్ అందజేశారు.
ఈ సందర్భంగా రవీందర్‌నాయక్ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకు 29 సంవత్సరాల అనుబంధం ఉందని, సంఘ్ పరివార్‌తోనూ సత్సంబంధాలు ఉన్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించానని చెప్పారు.