గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని పీజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్(ఫిజిక్స్)గా పనిచేస్తున్న డాక్టర్ ఎస్.రమాకాంత్‌కు తాను చేసిన రీసెర్చ్ పై పేటెంట్రైట్ దక్కింది. కేంద్ర పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు సౌజన్యంతో ‘లేజర్ బేస్డ్ మెథడ్ టు క్రిస్టలైజేషన్ ఆఫ్ ఫెర్రో ఎలక్ట్రిక్ థిన్ ఫిలిమ్స్ ఎట్ సబ్ 300 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఫర్ ట్యూనెబుల్ మైక్రోవేవ్ డివైజస్’ అనే అంశంపై రమాకాంత్రీసెర్చ్చేశారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్కు చెందిన ప్రొఫెసర్ కేసీ జేమ్స్ రాజు పర్యవేక్షణలో కంప్యూటర్లో పలుచని పరికరాలపై తక్కువ వేడిలో ఎలక్ట్రానిక్పరికరాలను వాడకంపై ఈ రీసెర్చ్ కొనసాగింది. రమాకాంత్ ప్రస్తుతం పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. కాలేజీ ఫ్యాకల్టీ డాక్టర్ సురేశ్ కుమార్, డాక్టర్ రమేశ్ రెడ్డి, అజయ్, యాదయ్య, రవి, ప్రసాద్, సావిత్రి, సల్మా సుల్తానా, అజీజ్ తదితరులు బుధవారం ఆయన్ని అభినందించారు.