బాసర ట్రిపుల్‌‌‌‌ ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళన

బాసర ట్రిపుల్‌‌‌‌ ఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళన

బాసర, వెలుగు : నిర్మల్‌‌‌‌ జిల్లా బాసర ట్రిపుల్‌‌‌‌ ఐటీలో పనిచేస్తున్న అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్లు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఉన్నత విద్యాకమిషన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముట్టడికి యత్నించిన అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్ల అరెస్ట్‌‌‌‌ను నిరసిస్తూ గురువారం విధులు బహిష్కరించి ప్రధాన గేటు ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అధికారంలో రాక ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. 

కాంట్రాక్ట్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్లపై ప్రభావం చూపే జీవో 21ను రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్‌‌‌‌ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్‌‌‌‌ చేయాలని, బేసిక్, డీఏ, హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ఏ, మూడు శాతం కలుపుకొని వేతనాలను అందించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. 

కార్యక్రమంలో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కృష్ణ ప్రసాద్, ఉపేందర్, శ్రీశైలం,శంకర్‌‌‌‌ దేవరాజ్‌‌‌‌, వినోద్‌‌‌‌, ఉపేందర్‌‌‌‌, కృష్ణప్రసాద్‌‌‌‌, వినోద్‌‌‌‌, సతీశ్‌‌‌‌, విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌, శ్రీశైలం, శంకర్‌‌‌‌ దేవరాజ్‌‌‌‌ 
పాల్గొన్నారు.