
చెన్నైలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)- సదరన్ రీజియన్‌లోని వివిధ విమానాశ్రయాల్లో 119 జూనియర్/ సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. డిసెంబర్ 27 నుంచి జనవరి 26 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.