విదేశాల్లో వ్యాపార అవకాశాలపై..అసోచామ్​ మీటింగ్‌

విదేశాల్లో వ్యాపార అవకాశాలపై..అసోచామ్​ మీటింగ్‌

హైదరాబాద్, వెలుగు: అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), షార్జా, యూఏఈ ప్రభుత్వం సహకారంతో  తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ మద్దతుతో హైదరాబాద్​లో “యూఏఈ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీ వ్యాపారాన్ని విస్తరించడం” అనే అంశంపై బీ2బీ సమావేశాలు నిర్వహించింది.

యూఏఈ లోని షార్జా ఎయిర్‌‌‌‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఫ్రీ (సైఫ్ ) జోన్​లో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఆసక్తిగా ఉన్న 85 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొన్నాయి. ఇతర మధ్యప్రాచ్య దేశాలలో అందుబాటులో ఉన్న వివిధ  పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. అక్కడ వ్యాపారాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, విదేశీ కంపెనీలకు అందించే ప్రోత్సాహకాలు గురించి వివరించారు. భారతీయ కంపెనీలు తమ మార్కెట్ పరిధిని ఎలా పెంచుకోవచ్చో నిపుణులు తెలిపారు. 

మరిన్ని వార్తలు