జైలుకు వెళ్తేనే రాజకీయ నాయకుడు.. కేసు లేనిదే ఓటు పడదు అన్నట్టు సమాజం మారిపోతుంది. రేపిస్టులు, క్రిమినల్స్ ఎలక్షన్స్ లో గెలిచి పార్లమెంట్‌కు వెళ్తున్నారు. అవును మీరు విన్నది కరెక్టే.. 18వ లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన MPల్లో సగం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నవారేనని ఎన్నికల హక్కుల సంఘం అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఎంపీలుగా గెలిచిన 543మందిలో 251 మంది వివిధ కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారే ఉన్నారు. అందులో 27 మంది దోషులుగా తేలిన వారే..
రానురాను వారి సంఖ్య పెరుగుతుంది
ప్రస్తుత లోక్ సభ సభ్యులల్లో 46శాతం మందిపైన క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. అయితే గత ఎన్నికలతో పోల్చు కుంటే ఈ సంఖ్య పెరుగుతూ పోతుంది. ఈ ఏడాది గెలిచిన 251 మంది అభ్యర్థుల్లో 170 మంది (31 శాతం) అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై లాంటి క్రైమ్స్ కేసులను ఎదుర్కొంటున్నారు. 17వ లోక్ సభలో 29 శాతం ఎంపీలు, 16వ లోక్ సభలో 21 శాతం ఎంపీలు, 15వ లోక్ సభలో 14 శాతం ఎంపీలు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే ఉన్నార ఎన్నికల హక్కుల సంఘం అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణలో తేలింది.
ఏ పార్టీలో ఎంతమంది?
బీజేపీ పార్టీలో 240 ఎంపీలకు గాను 94 (39 శాతం) మంది, కాంగ్రెస్ లో 99 ఎంపీల్లో 49 (49శాతం) మంది, సమాజ్ వాదీ పార్టీ 37 MPలకు 21(45 శాతం) మంది, టీఎంసీ 29లో 13 మంది, డీఎంకే 22 ఎంపీల్లో 13 మంది నేరారోపణలు ఉన్నవారే ఉన్నారు.