
- ప్రారంభించిన యాంఫీ
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్) గురించి అవగాహన కల్పించడానికి, పెట్టుబడులను పెంచడానికి అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) మూడు కార్యక్రమాలను ప్రారంభించింది. యంగ్ఇన్వెస్టర్లను ఎంకరేజ్ చేయడానికి తరుణ్ యోజన, మరచిపోయిన ఎంఎఫ్‌లను ట్రాక్ చేయడానికి మిత్రను మొదలు పెట్టింది. ఇదిగాక ఎంఎఫ్ఇన్వెస్ట్మెంట్లను పెంచడానికి యాంఫీ, సెబీ కలసి మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
తక్కువ ఆదాయం గల వాళ్లు, ఫస్ట్‌టైం ఇన్వెస్టర్లు కూడా ఎంఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడానికి నెలకు రూ.250తో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ప్లాన్(సిప్)ను సెబీ రూపొందించాయి. తరుణ్ యోజన ద్వారా స్కూళ్లలో స్టూడెంట్లకూ ఎంఎఫ్‌ల గురించి అవగాహన కల్పిస్తారు. ఎంఎఫ్‌లలో పెట్టి మర్చిపోయిన డబ్బును తిరిగి తీసుకోవడానికి ఎంఎఫ్ ట్రేసింగ్అండ్ రిట్రీవల్ అసిస్టెంట్(మిత్ర) ఉపయోగపడుతుంది. మనదేశంలో ఎంఎఫ్ పరిశ్రమ దూసుకెళ్తోంది. అసెట్ అండర్ మేనేజ్మెంట్(ఏయూఎం) విలువ రూ.65 లక్షల కోట్లు దాటిందని యాంఫీ వర్గాలు తెలిపాయి.