మరో రెండు రోజుల్లో భూమి దగ్గరగా ఓ ఆస్ట్రాయిడ్ ప్రయాణించనుంది. అనుకోని పరిణామాలు వల్ల ఆ గ్రహశకలం భూమి మీద కూడా పడవచ్చని ఖగోళశాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు రెండు ఫుట్ బాల్ కోర్టుల అంత పరిమాణం ఉన్న ఓ గ్రహశకలం భూమివైపుకు దూసుకొస్తున్నట్లు సైంటిస్టూలు హెచ్చరిస్తున్నారు. NASA నిరంతరం భూమికి సమీపంలో ఉన్న వస్తువులను ట్రాక్ చేస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఓసారి ఇలాంటి సంఘటన జరుగుతుందని వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ తెలిపింది.
భూమి ఉత్తర అర్ధగోళం నుంచి క్లియర్ గా ఈ గ్రహశకలం కనిపిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. శాస్త్రవేత్తలు ఈ ఆస్ట్రాయిడ్ కు 2024 ON అని పేరు పెట్టారు. 2024 సెప్టెంబర్ 15న 2024 ON భూమికి 620,000 మైళ్ల దూరంలో వెళుతుంది. స్పెస్ లో ఈ దూరం అంత పెద్దది కాదని.. ఇది భూమి, చంద్రునికి మధ్య దూరానికి 2.6 రెట్లు మాత్రమే అని శాస్త్రవేత్తులు హెచ్చరిస్తున్నారు. 720 అడుగులు వెడల్పు ఉన్న ఈ గ్రహశకలం భూమిని తాకితే.. భారీగా నష్టం జరుగుతుందని అలర్ట్ చేస్తున్నారు ఖగోళ శాస్త్ర నిపుణులు. నాసా ప్రకారం.. 150 మీటర్లు (492 అడుగులు) కంటే పెద్దగా, 4.6 మిలియన్ మైళ్ల (7.4 మిలియన్ కిలోమీటర్లు) కంటే తక్కువ దగ్గరగా ఉన్న గ్రహశకలాలు భూమికి ప్రమాదకర గ్రహశకలాలు పరిగణించబడతాయి. ప్రస్తుతానికి ఈ 2024 ON వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని సైంటిస్టులు చెప్తున్నారు.
ALSO READ | ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ ఇదే
ఉత్తర అర్ధగోళం నుంచి సెప్టెంబర్ 15న 2:30 సమయంలో టెలిస్కోప్‌లు లేదా బైనాక్యులర్ సాయంతో ఈ గ్రహశకలం చూడవచ్చు. NASA ప్రకారం.. గ్రహశకలాలు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సోలర్ ప్లానెట్ నుంచి ఏర్పడినాయి. తర్వాత రాతి ముక్కలుగా స్పేస్ లో మిగిలిపోయాయి. ఇవి వివిధ సైజుల్లో ఉంటాయి. ఆస్ట్రాయిడ్స్ సూర్యుని నుంచి వేర్వేరు దూరాలలో వేర్వేరు ప్రదేశాలలో ఏర్పడినందున.. ఏ రెండు కూడా ఒకేలా ఉండవు. చాలా గ్రహశకలాలు వివిధ రకాల రాళ్లతో తయారు చేయబడ్డాయి. కొన్నింటిలో నికెల్ మరియు ఇనుము వంటి లోహలు, మట్టి ఉంటాయి.