న్యూఢిల్లీ: నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. టీబీ, ఆస్తమా, గ్లాకోమా, తలసేమియా, మెంటల్ హెల్త్ కు సంబంధించిన 8 రకాల మెడిసిన్ల ధరలను 50% వరకు పెంచేసింది. కొన్ని మెడిసిన్ల ధరలను పెంచేందుకు అనుమతించాలని పలు ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇటీవల ఎన్‌పీపీఏను కోరాయి.
ఫార్మాస్యూటికల్ కంపెనీల అభ్యర్థనపై చర్చించేందుకు ఎన్‌పీపీఏ అధికారులు ఇటీవల సమావేశం నిర్వహించారు. పలు మెడిసిన్ల ధరలను 50% పెంచేందుకు ఆమోదం తెలిపారు.