అస్త్ర ఎంకే–3 క్షిపణి పేరు గాండీవగా ఎందుకు మార్చారంటే.?

అస్త్ర ఎంకే–3 క్షిపణి పేరు గాండీవగా ఎందుకు మార్చారంటే.?

డిఫెన్స్ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ ఆర్గనైజేషన్​ అభివృద్ధి చేస్తోన్న ఎయిర్​ టు ఎయిర్​ మిస్సైల్​అస్త్ర ఎంకే–3 పేరును గాండీవగా మార్చింది. గాండీవం మహాభారతంలోని అర్జునుడి ధనస్సు పేరు. 
    
అస్త్ర ఎంకే–3 అనేది అస్త్ర క్షిపణి సిరీస్​లో మూడోది. దీనిని అస్త్ర ఎంకే–1, ఎంకే–2 క్షిపణుల తర్వాత భారత్​ డైనమిక్స్ లిమిటెడ్​(బీడీఎల్)తో కలిసి డీఆర్ డీవో అభివృద్ధి చేస్తోంది. 
    
 ఇది వాతావరణంలో ఉండే ఆక్సిజన్​ను ఆక్సీకరణ కారకంగా ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక సాలిడ్​ ఫ్యూయల్​ డక్టెడ్​ రామ్​జెట్​ ప్రొపల్షన్​ సిస్టమ్​ద్వారా పని చేస్తుంది. 
    
 ఇది 300–350 కిలోమీటర్ల పరిధి వరకు నిర్దేశిత లక్ష్యాలను ఛేదించగలదు. మాక్​ 4.5 వరకు సూపర్​ సోనిక్​ వేగాన్ని తట్టుకోగలదు. 
    
 20 డిగ్రీల కోణంలో శత్రు యుద్ధ విమానాలను ఛేదించి దాడి చేయగలిగేలా దీనిని అభివృద్ధి చేస్తున్నది. 
    
 గాండీవ క్షిపణి 10 కి.మీ. స్నాప్​అప్/ స్నాప్​ డౌన్​ సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. ఇది ఫైరింగ్​ విమానం కంటే ఎక్కువ లేదా తక్కువ ఎత్తులో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడానికి వీలు కల్పిస్తుంది. 
అస్త్ర క్షిపణి
    
 గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగిచవచ్చు.  స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన బియాండ్​ విజువల్​ రేంజ్​ఎయిర్ టూ ఎయిర్​ మిస్సైల్​క్షిపణి పరిధి 80 కి.మీ.
    
సుఖోయ్ ​ఎస్​యూ–30, తేలికపాటి తేజస్​ యుద్ధ విమానాల్లో అస్త్ర క్షిపణులను వైమానిక దళం వినియోగిస్తుంది.