లైంగిక వేధింపులు అనేవి సినీ నటులకు, క్రీడాకారులకు, ఉద్యోగిణిలకు, సామాన్యులకు మాత్రమే కాదు.. ప్రజల కోసం ప్రజల తో ఎన్నుకోబడిన రాజకీయ మహిళా నేతలకు కూడా తప్పవని తెలుస్తోంది. తాజాగా ఆస్ట్రేలియన్ ఎంపీ మహిళా ఎంపీ బ్రిట్టనీ లౌగా తనపై అత్యాచారం జరిగిందని సోషల్ మీడియాలో తెలిపింది.తన నియోజకవర్గం యెప్పూన్‌లో సాయంత్రం సమయంలో బయట దాడికి గురయ్యానని చెప్పారు.
ఆస్ట్రేలియాలో దారుణం చోటు చేసుకుంది . ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర ఎంపీ క్వీన్స్ ల్యాండ్ లేబర్ పార్టీ మహిళా ఎంపీ బ్రిట్టనీ లౌగా (37) తన ఇన్స్ టాగ్రామ్ అకౌంట్ లో తనపై జరిగిన అత్యాచారం గురించి పోస్టు పెట్టారు. ఈ పోస్టు చదివిన వారంతా ఆశ్చర్యపోయారు.ఏప్రిల్ 28న నైట్ అవుట్‌లో తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించారని క్వీన్స్ లాండ్ లేబర్ పార్టీ ఎంపీ బ్రిటీనీ లాగా చేసిన ఆరోపణలపై ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర ఎంపీ క్వీన్స్ ల్యాండ్ మహిళా ఎంపీ బ్రిట్టనీ లౌగా ఆమె తన మిత్రులతో కలిసి ఒక నైట్ పార్టీకి వెళ్లినప్పుడు ఎవరో తన డ్రింక్ లో మత్తు మందు కలిపారని.. ఆ తరువాత తను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం చేశారని ఆమె తెలిపారు. ఈ ఘటన తరువాత ఆమె ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయిస్తే.. తన రక్తంలో మత్తు పదార్థాలు ఉన్నట్లు తెలిసిందని.. తాను ఎప్పుడూ మత్తు, లేదా డ్రగ్స్ తీసుకోనని ఆమె తన ఇన్స్ టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఆస్పత్రిలో టెస్టులు గురించి తెలిశాక తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు.
తనతోపాటు నైట్ పార్టీకి వచ్చిన ఇతర మహిళల డ్రింక్స్ లో కూడా ఇలాగే మత్తు పదార్థాలు కలిపినట్లు తెలిసిందని బ్రిట్టనీ వెల్లడించారు. ఇలాంటి ఘటన ఎవరికైనా జరగవచ్చు.. ఇప్పటికే ఇలా మనలో చాలామందికి జరిగి ఉండవచ్చు. కానీ దోషులకు శిక్ష పడాలి.. పార్టీలకు వెళితే.. మన డ్రింక్స్ లో ఏదో కలిపి ఇస్తారనే భయంతో స్నేహితులతో పార్టీలు చేసుకోకుండా ఉండగలమా?, అని బ్రిట్టనీ ప్రశ్నించారు. బ్రిట్టనీ దాదాపుగా ఒక దశాబ్ధంగా పార్లమెంట్ సభ్యురాలిగి ఉన్నారు, ఆమె మొదటిసారిగా 2015లో కెప్పెల్ స్థానానికి ఎన్నికయ్యారు.
క్వీన్స్ ల్యాండ్ హౌసింగ్ మినిస్టర్ మేగన్ స్కాన్ లాన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. బ్రిట్టనీకి జరిగిన విషయం తెలిసి తాను షాక్ గురయ్యానని అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బ్రిట్టనీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని క్వీన్స్ ల్యాండ్ పోలీసులు తెలిపారు.
ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్న క్వీన్స్ లాండ్ పోలీసులు ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇతర నివేదికలు ఏమీ లేవని, ఎవరికైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని కోరారు. క్వీన్స్‌లాండ్ హౌసింగ్ మంత్రి మేఘన్ స్కాన్లాన్ ఆరోపణలను షాకింగ్, భయంకరమైనవిగా పేర్కొన్నారు.
ఇటీవల కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో అత్యధికంగా లింగ-ఆధారిత హింస చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ కూడా గృహ హింసను జాతీయ సంక్షోభంగా అభివర్ణించారు. స్త్రీద్వేషపూరిత ఆన్‌లైన్ కంటెంట్‌పై కఠినంగా వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. 2023 లో కూడా ఆస్ట్రేలియన్ ఎంపీ లిడియా థోర్ప్ కన్జర్వేటివ్ ఎంపీ డేవిడ్ వాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. పార్లమెంటు లోపల తనపై లైంగిక దాడి జరిగిందని థోర్ప్ చెప్పారు.