ఈ కోవిడ్ వ్యాక్సిన్ తయారీ, అమ్మకాలు ఇక ఉండవు

కోవిడ్ 19 వ్యాక్సిన్లలో ఒకటైన ఆస్ట్రాజైనాకాను ఆ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు నిషేదించింది. ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ వస్తున్నాయని బ్రిటన్‌లో రెండు నెలల క్రితం జరిగిన కోర్టు విచారణలో దాని తయారీ కంపెనీ అంగీకరించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్‌గా తయారు చేసిన విషయం తెలిసిందే. 

ఇండియాలో ఎక్కువమంది తీసుకున్న వ్యాక్సిన్ కోవిషీల్డ్ కూడా ఈ కంపెనీ తయారు చేసింది. కొన్ని వాణిజ్య కారణాలతో వ్యాక్సిన్‌ను వరల్డ్ వైడ్ మార్కెట్‌ల నుంచి తొలగిస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. ఆ కంపెనీ వ్యాక్సిన్ ను మార్కెట్ నుంచి తీసేయడానికి మార్చి 5న దరఖాస్తు చేసుకోగా, మే 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై ఆస్ట్రాజైనెకా వ్యాక్సిన్లు తయారీ, అమ్మకాలు ఉండవు. 

రక్తం గడ్డకట్టడం, రక్త కణాలు తగ్గడం వంటి అరుదైన దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయని ఆస్ట్రాజెనెకా కంపెనీ తయారు చేసిన కోవిషీల్డ్, వాక్స్‌జెవ్రియా వ్యాక్సిన్లపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు అవి తీసుకున్నవారికి థ్రోంబోసిస్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS) సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని స్వయంగా తయారీ సంస్థనే ఒప్పుకుంది.