విరాట్ కోహ్లీ ఎప్పుడు రిటైర్ అవుతాడు : ఆ జ్యోతిష్యం నిజం అవుతుందా..?

విరాట్ కోహ్లీ ఎప్పుడు రిటైర్ అవుతాడు : ఆ జ్యోతిష్యం నిజం అవుతుందా..?

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చివరి వరల్డ్ కప్ ఆడేశాడనేది కొంతమంది వాదన. 2008 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన విరాట్.. 15 ఏళ్లుగా తన క్రికెట్ ప్రయాణాన్ని  విజయవంతగా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లీ వయసు 35 ఏళ్ళు. సాధారణంగా మూడు పదులు దాటినా వయసులో ఆటగాళ్ల రిటైర్మెంట్ పై చర్చ జరుగుతుంది. విరాట్ విషయంలోను  ఇది మినహాయింపు కాదు. దీంతో కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడతాడా లేదా అనే భయం ఫ్యాన్స్ లో మొదలైంది. అయితే కోహ్లీ తన ఆటకు 2028 లో గుడ్ బై చెబుతాడని ఒక పోస్ట్ సోషల్  మీడియాలో వైరల్ గా మారుతుంది. 

ఈ వైరల్ పోస్ట్ "స్టార్స్ అండ్ ఆస్ట్రాలజీ" అనే Facebook (మెటా) పేజీ నుండి వచ్చింది. 2016 ఏప్రిల్‌లో ఇది షేర్ చేయబడింది.  ఇందులో విరాట్ కోహ్లీ జాతక విశ్లేషణ గురించిన విషయాలు ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. 2016 నుంచి చూసుకుంటే ప్రతి విషయంలోనూ ఇక్కడ ఉన్న జాతకం ప్రకారమే జరిగింది. ఈ విషయం కోహ్లీ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఇందులో కోహ్లీ 2028 మార్చ్ లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఉంది. విరాట్ కెరీర్ 2027లో అద్భుతంగా ఉంటుందని అతడు చాలా సంతోషంగా గొప్ప విజయంతో రిటైర్ అవుతాడు అని ఇక్కడ రాసి ఉంది. 2016 నుంచి ఈ స్టార్స్ అండ్ ఆస్ట్రాలజీని పరిశీలిస్తే.. అక్కడ రాసినట్టే జరిగింది.

2016, 17 లో విరాట్ కోహ్లీ కెరీర్ టాప్ ఫామ్ లో ఉంటుందని.. 2017 చివర్లో కానీ  2018 ప్రారంభంలో కానీ కోహ్లీ వివాహం జరుగుతుందని అక్కడ రాసి ఉంది. అంతే కాదు విరాట్ దంపతులకు పిల్లలు ఎప్పుడు పుడతారో అంతా ఇక్కడ ఉన్నట్లే జరిగింది. 2020-21 మధ్యలో కోహ్లీ పేలవ ఫామ్ లో ఉంటాడని, 2021-25 మధ్యలో కోహ్లీ కెరీర్ టాప్ లో ఉంటుందని ఈ జోతిష్యం చెబుతుంది. అన్ని చెప్పినట్టుగానే జరిగాయి కాబట్టి 2028 వరకు.. అంటే మరో 5 ఏళ్ళు కోహ్లీ  క్రికెట్ లో కొనసాగటం ఖాయం అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 2027 లో దక్షిణాఫ్రికా వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. కోహ్లీ ఈ వరల్డ్ కప్ కూడా ఆడతాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.    

ఈ వరల్డ్ కప్ లో 11 మ్యాచ్ లాడిన కోహ్లీ మొత్తం 765 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా నిలిచాడు. సెమీస్ లో న్యూజీలాండ్ పై సెంచరీ, ఫైనల్లో ఆస్ట్రేలియాపై కీలకమైన 54 రన్స్ చేసాడు. ఇంత చేసినా జట్టుకు టైటిల్ అందించలేకపోయాననే వెలితి కోహ్లీకి అలాగే ఉంది.