Market Astrology: జ్యోతిష్య పండితులు కరెక్ట్‌గా చెప్పారబ్బా.. స్టాక్ మార్కెట్ కుప్పకూలిందిగా..!

Market Astrology:  జ్యోతిష్య పండితులు కరెక్ట్‌గా చెప్పారబ్బా.. స్టాక్ మార్కెట్ కుప్పకూలిందిగా..!

Stock Market Astrology: ఏప్రిల్ రెండవ వారం ప్రారంభంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిల్లో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్, నిఫ్టీలు కుదేలయ్యాయి. అయితే దీనిని అనలిస్టులు ఊహించటంలో తడపడినప్పటికీ జ్యోతిష్య శాస్త్రం మాత్రం 100 శాతం దీనిని ముందుగానే ప్రిడిక్ట్ చేసింది. కొంత మంది జ్యోతిష్య నిపుణులు 2025లో ప్రతి నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలా ఉండనున్నాయి.. ఏఏ గ్రహాల మార్పు మార్కెట్లను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని వారు చెప్పారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఏప్రిల్ మాసం గురించి జ్యోతిష్య పండితులు చెప్పిన అంశాలను వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

2025 ఏప్రిల్ మాసంలో స్టాక్ మార్కెట్ల అంచనాల ప్రకారం ప్రధాన గ్రహాలైన రాహువు, బుధుడు, సూర్యుడు, శుక్రుడు, శని మీనరాశిలో పంచగ్రహ కూటమిగా ఏర్పడుతున్నాయి. దీనికి తోడు కేతువు కన్యా రాశిలో, బృహస్పతి వృషభరాశి అసాధారణంగా గ్రహ కూటమి దేశీయ స్టాక్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో కర్కాటకంలోనికి కుజుడి ప్రవేశం మార్కెట్ కదలికలను ప్రభావితం చేస్తుందని వారు పేర్కొన్నారు. 

అయితే ఏప్రిల్ 13న శుక్రుని తిరోగనం నుంచి సాధారణ గమనానికి మారుతున్నారు. ఇది మార్కెట్లలో కొంత మేర అనుకూల పరిస్థితులను తెచ్చిపెడుతుందని వారు చెబుతున్నారు. బృహస్పతి ప్రభావం వల్ల ఏప్రిల్ మాసంలో మార్కెట్లు పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ప్రధానంగా కెమికల్స్ రంగంలోని కంపెనీల షేర్లు పెరగొచ్చని వెల్లడించారు. ఇదే క్రమంలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫుడ్ రంగాల్లోని స్టాక్స్ కూడా ఒడిదొడుకుల నుంచి తేరుకుని సానుకూల ధోరణిని చూపవచ్చని వారు చెబుతున్నారు. 

►ALSO READ : Black Monday: 40 ఏళ్ల తర్వాత స్టాక్ మార్కెట్లో సేమ్ సీన్ రిపీట్.. 

ఏప్రిల్ రెండవ వారం గురించి చెప్పిందే జరిగింది..
ప్రస్తుతం మనం ఏప్రిల్ రెండవ వారంలో కొనసాగుతున్నాం. ఈ వారం మెుదటి రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనాన్ని చూశాయి. ఈవారం శుక్రుడు తిరోగమనం నుంచి సాధారణానికి మారుతున్నందున సెన్సెక్స్ బేరిష్ ట్రెండ్ కొనసాగిస్తుందని జ్యోతిష్య పండితులు ముందుగానే తమ ప్రిడిక్షన్లో వెల్లడించారు. అయితే బుధుడి ప్రభావంతో మూడో వారంలో మార్కెట్లు తిరిగి పుంజుకుని లాభాల బాట పడతాయని వారు చెబుతున్నారు. ఇక నెల నాలుగో వారంలో శుక్రుడు, శని ప్రభావం వల్ల బులిష్ ట్రెండ్ క్రమంగా బలహీనపడవచ్చని వారు వెల్లడించారు. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.